తెలంగాణ అప్పులపై కేటీఆర్ ట్వీట్.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ అప్పులపై కేటీఆర్ ట్వీట్..

February 4, 2020

Telangana

తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని విపక్ష కాంగ్రెస్, బీజేపీలు తరచూ ఆరోపిస్తుండడం తెలిసిందే. అయితే తాము రాష్ట్రంలో సంపదలు సృష్టిస్తామని, అవసరమైతేనే అప్పుకులకు వెళ్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (FRBM) రివ్యూ కమిటీ నివేదికలోని తెలంగాణ అప్పుల గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విపక్షాల ఆరోపణలన్నీ అబద్ధమని ఈ నివేదిక స్పష్టం చేశారు. తెలంగాణ అప్పులు నిబంధనల ప్రకారం రాష్ట్ర జీడీపీలో 20 శాతం కంటే కంటే తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ నివేదికను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు.  

నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ అప్పులు దేశ జీడీపీలో 40 శాతం లోపు, రాష్ట్రాల అప్పులు రాష్ట్ర జీడీపీలో 20శాతం లోపల ఉండాలి. అయితే కేంద్రం అప్పులు పరమితికి మించి జీడీపీలో 48శాతంగా ఉన్నాయి. కాగా, ఏపీ అప్పులు రాష్ట్ర జీడీపీలో 31.6 శాతంగా ఉన్నాయి. ఇవి FRBM పరిమితి కంటే 11.6శాతం ఎక్కువ.