తెలంగాణ పద్దు ముఖ్యాంశాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ పద్దు ముఖ్యాంశాలు

March 7, 2022

hhh

తెలంగాణ 2022-23 వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు.మిగతా శాఖలకు ఎంతంత కేటాయించారు అనే విషయాల్లోకి వెళ్తే..

1. నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు
2. ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు
3. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు
4. 9,123 స్కూళ్లలో మన ఊరు – మనబడికి రూ.3,497 కోట్లు
5. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు
6. రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు
7. ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
8. బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు
9. బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు
10. ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు

11. దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
12. దళిత బంధు ద్వారా ఈ ఏడాది 11,800 కుటుంబాలకు లబ్ధి
13. వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
14. హరిత హారానికి రూ.932 కోట్లు
15. పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
16. అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
17. కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు

18. రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు
19. క్యాపిటల్‌ వ్యయం రూ.29,728 కోట్లు
20. దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
21. గ్రామ పంచాయితీలకు ప్రతినెలా రూ. 227.5 కోట్లు
22. పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు
23. మన ఊరు, మన బడి కోసం రూ. 3497 కోట్లుగా కేటాయించారు.