Home > Featured > రూ.1,46,492 కోట్లతో రాష్ట్ర పద్దు.. సంక్షేమానికి పెద్దపీట

రూ.1,46,492 కోట్లతో రాష్ట్ర పద్దు.. సంక్షేమానికి పెద్దపీట

telangana budget ...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో 2019-2020 వార్షిక సంవత్సరానికి గాను సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. 'తక్కువ సమయంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో మొదటి స్థానంలో సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన అభివృద్ధి సాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర వృద్ధిరేటు 10.5గా నమోదైంది. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన మూలధన వ్యయం వాటా తక్కువ ఉండేది. సమైక్య పాలన చివరి పదేళ్లలో రూ.54,052కోట్లుగా ఉంది. గడిచిన ఐదేళ్లలో మూలధనవయ్యం లక్ష 65,165కోట్లుగా ఉందని' ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తరువాత తెలంగాణ అసెంబ్లీ 14వ తేదీకి వాయిద పడింది.

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

* రూ.1,46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్.

* రెవెన్యూ వ్యయం రూ.1,11,055కోట్లు.

* మూలధన వ్యయం రూ.17,274.67కోట్లు.

* బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08కోట్లు.

* రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74కోట్లు.

* రైతుబందుకు 12వేల కోట్లు.

* రైతు భీమా కోసం 1137 కోట్లు.

* పంటల రుణమాఫీ కోసం 6 వేల కోట్లు.

* విద్యుత్ సబ్సిడీల కోసం 8వేల కోట్లు.

* ఆసరా పెన్షన్ల కోసం 9, 402 కోట్లు.

* గ్రామ పంచాయతీలకు 2,714 కోట్లు

* మున్సిపాలిటీ లకు 1,764 కోట్లు కేటాయింపు.

* తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదటి ఏడాది నెలకు 6,247 కోట్లు ఖర్చు పెడితే…ప్రస్తుతం 11, 305 కోట్లు ఖర్చు పెడుతుంది.

* 2018-19 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర జీఎస్డీసి వృద్ధిరేటు రెండున్నర రేట్లకు పెరిగి 10.5 శాతం నమోదు.

* 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్రీయ దేశయోత్పత్తి విలువ 4, 51, 580 కోట్లు ఉంటే. 2018-19 నాటికి రాష్ట్ర సంపద 8, 65, 688 కోట్లు నమోదు.

Updated : 9 Sep 2019 1:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top