Home > Featured > అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం

అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం

Telangana .....

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సభను ప్రారంభించారు. తరువాత సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడనుంది.

ఆ తర్వాత అసెంబ్లీ ఉభయ సభల సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల పనిదినాలు, అజెండా ఖరారు కానుంది. సభ ప్రారంభానికి ముందు ప్రముఖ కవి, రచయిత కాళోజీ నారాయణరావు 105వ జయంతి వేడుకలు అసెంబ్లీలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ లాంజ్‌లోని కాళోజీ చిత్రపటానికి సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ రచనలను గుర్తు చేసుకున్నారు.

Updated : 9 Sep 2019 1:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top