తెలంగాణ కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీ సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు. అన్ని సామాజిక వర్గాలను ఆకర్షించే నిర్ణయాలు తీసుకున్నారు. దళిత బంధు రెండో విడత కింద 1.30 లక్షల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని నామమాత్రంగా అమలు చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఈ భారీ లక్ష్యాన్ని మంత్రిమంత్రి నిర్దేశించుకుంది. భేటీ వివరాలను ఆర్థిక మంత్రి హరీశ్ రావు మీడియాకు వెల్లడించారు.
నిర్ణయాలు
– దళితబంధు వేడుకలను ఆగస్టు నెలలో ప్రతీ ఏటా నిర్వహిస్తారు.119 నియోజకవర్గాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తాన్ని పంపిణీ చేస్తారు.
– సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహలక్ష్మి పథకం పేరుతో ఆర్థిక సాయం చేస్తారు. ప్రతీ ఇంటికి 3 లక్షల రూపాయలను గ్రాంట్‌గా మూడు దఫాలుగా ఇస్తారు. పథకం కింద 4 లక్షల ఇళ్లను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం, పథకం కోసం 12వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఇళ్లను మహిళ పేరుమీద రిజిస్టర్ చేస్తారు.
– రెండో విడత గొర్రెల పంపిణీకి రూ. 4463 కోట్ల కేటాయింపు. కలెక్టర్ పర్యవేక్షణలో గొర్రెల పంపిణీ.
– 4 లక్షల ఎకరాల భూమిని 1 లక్ష 55 వేల మందికి చేస్తారు.
– ట్యాంక్ బండ్ దగ్గర నిర్మిస్తున్న అంబెడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరణ
– కాశీ, శబరిమల క్షేత్రాలకు వెళ్లేవారి కోసం ఆ క్షేత్రాల్లో రూ. 25 కోట్లతో వసతి గృహాల నిర్మాణం