ఆర్టీసీ అంశమే అజెండాగా మంత్రివర్గ సమావేశం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ అంశమే అజెండాగా మంత్రివర్గ సమావేశం..

November 26, 2019

ఈనెల 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఆర్టీసీనే ప్రధాన ఎజెండాగా ఉండనుందని సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు చర్చిస్తారు. 

Telangana cabinet.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం.. రెండో రోజూ అంటే శుక్రవారం కూడా కొనసాగే ఆస్కారం ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో వాళ్లను విధుల్లోకి తీసుకునే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. హైకోర్టు ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానానికి బదిలీ చేసినందువల్ల సదరు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.