కేబుల్ ఆపరేటర్ల నేత కుల్దీప్ సహానీ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

కేబుల్ ఆపరేటర్ల నేత కుల్దీప్ సహానీ కన్నుమూత

November 5, 2020

bgnbfg

తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఆపరేట్ల సంఘం మాజీ అధ్యక్షుడు కుల్దీప్ సహానీ కన్నుమూశారు.కొన్నాళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చనిపోయారు. ఆయనను నిన్న నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. 

సహానీ తల్లిదండ్రులు పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందినవారు. దేశ విభజన తర్వాత నిజామాబాద్‌లో స్థిరపడ్డారు. సహానీ 20 ఏళ్ళ కిందట ఈఎంఎస్ న్యూస్ ఏజెన్సీ ఫ్రాంచైజ్ తీసుకుని మీడియా రంగంలో అడుగుపెట్టారు. 2002లో సీ చానల్ నిర్వహిస్తూ కేబుల్ రంగంలోకి వచ్చారు. అనతి కాలంలో వ్యాపారాన్ని విస్తరించారు. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలు ఆయన పరిధిలోకి వచ్చాయి. రాష్ట్ర ఎంఎస్ఓల సంఘాన్ని స్థాపించి సారథ్యం వహించారు. తర్వాత పోటీ పెరగడంతో ఇతర రంగాలపై దృష్టి సారించారు. అండమాన్ దీవుల్లో హోటల్ నిర్మించటంతోబాటు బాసరలో రిసార్ట్స్ నిర్మించారు. క్రీడాకారులను ప్రోత్సహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా సమర్థించారు. ఆంధ్ర ప్రాంత ఎమ్మెస్వోల దుశ్చర్యలను అడ్డుకున్నారు. సహానీ ‘ఇందూర్ మిర్రర్’ పేరుతో వారపత్రిక కూడా నిర్వహించారు.