Telangana: Candidates..certificate will be issued within two days
mictv telugu

తెలంగాణ: అభ్యర్థుల్లారా..రెండు రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ

September 12, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసీ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్ధినీ, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఔషధ మండలి ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. 2019వ సంవత్సరం తర్వాత తమ సర్టిఫికెట్లను రెన్యువల్ చేసుకోవాల్సిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే ఆ ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఔషధ మండలి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీ కౌన్సిల్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు కేవలం రెండు రోజుల్లోనే సర్టిఫికెట్ మంజూరు చేస్తున్నామని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

”తెలంగాణ రాష్ట్ర ఔషధ మండలిలో 2019 తర్వాత సర్టిఫికెట్లను రెన్యువల్ చేసుకోవాల్సిన ఫార్మసీ అభ్యర్థులకు హైదరాబాద్లోనే ఆ ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే సుమారు 2,500 మంది రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి వారం రోజుల్లో సర్టిఫికెట్లు జారీ చేస్తాం. ఇంకా ఎవరైనా 2019 తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సిన అభ్యర్థులుంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. వీరందరూ ఏపీ ఔషధ మండలికి వెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సర్టి ఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకొన్నవారికి రెండు రోజుల్లోనే మంజూరు చేస్తున్నాం. ఎన్వోసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం ఏపీ కౌన్సిలకు వెళ్లవద్దు. పెండింగ్ దరఖాస్తులను ఈ వారం రోజుల్లో పరిశీలించి, సర్టిఫికెట్లను జారీ చేస్తాం” అని ప్రకటనలో వెల్లడించారు.