ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతబోధకులపై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కామం కళ్లకు కమ్మిన బోధకులు పసిపిల్లలను సైతం కాటేస్తూ మతానికి మచ్చతెస్తున్నారు. దీనిపై పోప్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు క్రీస్తుకు చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. కేరళలో సన్యాసినిపై ఒక బిషప్ అత్యాచారం చేసినట్లు వచ్చిన వార్తలు కలకలం సృష్టిస్తుండం తెలిసిందే. తాజా అమెరికాలో తెలంగాణకు చెందిన ఒక బోధకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలో తెలంగాణలో హోలీ స్పిరిట్ ఫాదర్ సంస్థలో పనిచేసిన ఇటుకలపాటి జాన్ ప్రవీణ్ కుమార్(38).. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై దక్షిణ డకోటా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ పదేళ్ల కిందట అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ర్యాపిడ్ సిటీ బోధనలు చేసత్న్నాడు. అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాని 16 ఏళ్ల బాలిక అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువైతే అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష, 30 వేల డాలర్ల జరిమానా పడుతుంది.