ఘనంగా కేసీఆర్ దత్తకూతురి పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

ఘనంగా కేసీఆర్ దత్తకూతురి పెళ్లి

December 28, 2020

kcrr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఈ రోజు ఘనంగా జరిగంది రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వేడుకు నిర్వహించారు.ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, ఇతర ప్రముఖు హాజరయ్యారు. సీఎం సతీమణి శోభ నిన్న ప్రత్యూష ఇంటికి వెళ్లి ఆమెను పెళ్లికూతురిని చేశారు. పట్టుబట్టలు, వజ్రాల నెక్లెస్ అందించి ఆశీర్వదించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూషకు చరణ్‌రెడ్డితో అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. అతడు ప్రత్యూషకు దూరపు బంధువు.  

కుటుంబ సమస్యలతో ప్రత్యూష చావుబతుకుల్లో ఉండగా కేసీఆర్ ఆదుకు దత్తత తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన ప్రత్యూషను సవతి తల్లి దారుణంగా వేధించేంది. ప్రత్యూష తల్లి చనిపోయే ముందు ఆస్తిని కూతురుపై రాసింది. తండ్రి ప్రత్యూష బాగోగులను పట్టించుకోకపోవడంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. ప్రత్యూష పేరుపై ఉన్న ఆస్తి కోసం సవతి తల్లి వేధింపులకు పాల్పడేది. ప్రత్యూషకు మైనారిటీ తీరి ఇంటికి రావడంతో ఆమెను కాల్చుకు తినేది. తీవ్రంగా కొట్టి హింసిచేది. చావుబతుకుల్లో ఉన్న ప్రత్యూష విషాదం మీడియా ద్వారా వెలుగు చూసింది. కేసీఆర్ చలించిపోయి ఆమెకు మెరుగైన వైద్యం చేయించి దత్తత తీసుకున్నారు. నర్సింగ్ చేసిన ప్రత్యూష ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.