ప్రతి ఇంటికి రూ. 10 వేలు, వారికి లక్ష..  కేసీఆర్ ప్రకటన  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతి ఇంటికి రూ. 10 వేలు, వారికి లక్ష..  కేసీఆర్ ప్రకటన 

October 19, 2020

వదదల్లో నష్టపోయిన వారిని తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇది నిబ్బరంగా ఉండాల్సిన సమయని, ప్రభుత్వం బాధతులకు అండగా ఉంటుందన్న ఆయన తక్షణ సాయం కోసం మునిసిపల్ విభాగానికి రూ. 550 కోట్లను విడుదల చేశారు. 

వరద ప్రభావిత ప్రాంతంలో ప్రతి ఇంటికి రూ. 10 ఇస్తామని, ఇళ్లను పూర్తిగా కోల్పోయిన వారికి రూ. లక్ష సాయం చేస్తామని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. అలాటే ఇళ్లను పాక్షికంగా కోల్పోయినవారికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గత వందేళ్లలో ఎన్నూడూ లేనంత వర్షాలు కురిశాయని, పరిస్థితిని చక్కదిద్దడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మరోపక్క.. హైదరాబాద్ నగరంలో సహాయక చర్యల కోసంతమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు ప్రకటించింది. విపత్కర పరిస్థితుల్లో తాము అండగా ఉంటామని సీఎం పళినసామి చెప్పారు.