రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేసీఆర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేసీఆర్‌

July 18, 2019

Telangana chief minister kcr.

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక చట్టం-2019 బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఈరోజు సాయంత్రం వరకు బిల్లుపై సవరణలు స్వీకరించనున్నారు. కొత్త పురపాలక చట్టం బిల్లుపై శుక్రవారం సభలో చర్చజరగనుంది. 4 ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం బిల్లును సభ ముందుకు తీసుకొని వచ్చింది.  వైద్య కళాశాల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును కూడా కేసీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు.