కేసీఆర్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురి అరెస్ట్

May 18, 2019

Telangana chief minister kcr signature forgery for regularization of costly land in gachibowli three arrested.

చిన్నాచితకా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి పబ్బం గడుపుకోవడం మామూలే. కానీ, మరీ చీప్‌గా వాళ్ల సంతకం ఎందుకనుకున్నారు నలుగురు కేటుగాళ్లు. విలువైన ఆస్తిని కొట్టెయ్యడానికి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చారు. నకిలీ డాక్యుమెంట్లు  సృష్టించి రెవిన్యూ విభాగానికి టోకరా కొట్టించబోయారు. కథ అడ్డం తిరిగి ముగ్గర జైల్లో పడ్డారు. మరొకడు పరారీలో ఉన్నారు.

గచ్చిబౌలిలో 44/పీ సర్వేనంబరులో ఉన్న ఖరీదైన 2 ఎకరాల భూమిని తమ పేరిట రెగ్యూలరైజ్ చేయాలంటూ మహ్మద్ ఉస్మాన్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి రాజేంద్ర నగర్ ఆర్టీవోకు దరఖాస్తు పెట్టుకున్నారు. దానిపై కేసీఆర్ సంతకం ఉండడంతో అధికారులు జాగ్రత్తగా తనిఖీ చేశారు. అది నకిలీదని తేలడతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు.. యాకుత్‌పురాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత నుంచి సీఎం లెటర్ హెడ్‌ను  రూ.45 వేలకు కొన్నారు. దానిపై 2 ఎకరాల భూమిని రెగ్యూలరైజ్ చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆయన సంతాకాన్ని ఫోర్జరీ చేశారు. తాము రాయదుర్గం నివసిస్తున్నామని అడ్రసులు కూడా పొందుపరిచారు. పోలీసులు వాళ్ల ఇంటికెళ్లి అరెస్ట్ చేశారు.