తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసైతో భేటీ కానున్నారని సమాచారం. ముఖ్యమంత్రితో పాటు ఆర్టీసీ అధికారులు కూడా ఉండనున్నారని తెలుస్తోంది. తమిళిసై గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా కేసీఆర్ సమావేశం అవుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.
ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమ్మె తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించనున్నారని సమాచారం. అలాగే రూట్ల ప్రైవేటీకరణ, ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశం, కేంద్ర మోటార్ వెహికల్ చట్టానికి అనుగుణంగా కొత్త చట్టాన్ని అమలు చేయడం..తదితర విషయాలను గవర్నర్కు వివరించే అవకాశం ఉంది.