రామేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ పూజలు - MicTv.in - Telugu News
mictv telugu

రామేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ పూజలు

May 10, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఆయన ఈరోజు రామేశ్వరంలోని ప్రసిద్ధ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.

Telangana chief minister kcr visited tamil nadu's prestiges rameshwaram temple.

ఈ పర్యటనలో ఆయనతో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈనెల 13న తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ కావాలని కేసీఆర్ ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ప్రస్తుతం స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో కేసీఆర్‌తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. దక్షిణాది పర్యటనలో ఉన్న కేసీఆర్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పునరాయి విజయన్‌తో భేటీ అయిన సంగతి తెలిసందే.