కాళేశ్వరం పర్యటనలో కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కాళేశ్వరం పర్యటనలో కేసీఆర్

May 19, 2019

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

Posted by KCR on Saturday, 18 May 2019

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఉన్నారు. ఆదివారం ఉదయం రామగుండం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహదేవ్‌పూర్ మండలం కన్నేపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం ఆలయానికి వెళ్లి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరిగి కన్నేపల్లి పంప్‌హౌస్ దగ్గరున్న హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి మేడిగడ్డ బరాజ్ వెళ్తారు.

మధ్యాహ్నం వరకు బరాజ్ దగ్గర కాళేశ్వరం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. కరకట్టల నిర్మాణం, గేట్ల బిగింపు, పనుల పరోగతిపై సాగునీటి శాఖ ఇంజినీర్లతో సమీక్షిస్తారు. తిరిగి రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి తర్వాత హైదరాబాద్‌కు పయనమవుతారు. కేసీఆర్ పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.