గల్ఫ్‌లో తెలంగాణ వాసి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

గల్ఫ్‌లో తెలంగాణ వాసి ఆత్మహత్య

July 14, 2020

vbfhty

గల్ఫ్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా మరో తెలంగాణ పౌరుడు  గల్ఫ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. 

బహేరిన్ దేశంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వాట్సప్‌‌లో తల్లిదండ్రులకు బాధ పడొద్దని వాయిస్ మెస్సేజ్ పంపించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నవీన్ మృతదేహాన్ని రాష్ట్రానికి రప్పించడానికి ప్రభుత్వం మద్దతు చేయాలని కుటుంసభ్యులు కోరుతున్నారు.