Telangana CM announces Rs 2 crore reward for Nikhat Zareen, Esha Singh
mictv telugu

మొగులయ్యకు కోటి ఇచ్చిన కేసీఆర్.. నిఖత్, ఇషాలకు కూడా…

June 2, 2022

Telangana CM announces Rs 2 crore reward for Nikhat Zareen, Esha Singh

తెలంగాణ కీర్తిని ప్ర‌పంచానికి చాటిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో చెరో రూ.2 కోట్ల నగదు బహుమతి అందించారు. నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌ కుటుంబసభ్యులను ప్రగతిభవన్‌కు ఆహ్వానించిన సీఎం.. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌తో కలిసి కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా జరీన్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ పంచ్‌ ఎలా ఇవ్వాలో సరదాగా సాధన చేస్తూ కనిపించారు. నిఖత్ జ‌రీన్‌ పట్టుదలను, ఆత్మస్థైర్యాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణ క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీర‌కంగా, మానసికంగా, ధృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన‌ నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ల‌ను చూసి తెలంగాణ యువతీ యువకులు స్పూర్తి పొందాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అదే స‌మ‌యంలో మొగుల‌య్య‌కు గ‌తంలోనే ప్ర‌క‌టించిన రూ.1 కోటి ప్రోత్సాహ‌కాన్ని కూడా ఆయ‌న‌కు కేసీఆర్ అంద‌జేశారు.