బస్టాండ్లు అమ్మి జీతాలు చెల్లించాలి.. బుద్ధి లేని సమ్మె..కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

బస్టాండ్లు అమ్మి జీతాలు చెల్లించాలి.. బుద్ధి లేని సమ్మె..కేసీఆర్

October 24, 2019

Telangana cm kcr about rtc strike

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. మొదట హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

* ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్న ఒక పిచ్చి పంథా…ఈ సమ్మె.

 

* ఆర్టీసీపైన నాకు అభిమానం ఉంది.

 

* నేను రవాణా శాఖ మంత్రుగా 3 సంవత్సరాలు పనిచేశాను.

 

* ఆర్టీసీ కార్మికులకు 67శాతం జీతాలు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. 

 

* ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతాం అంటే ఎలా.

 

* ఎవడు పడితే వాడు వచ్చి ప్రభుత్వంలో కలపమంటే కలుపాతామా?

 

* నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారా?

 

* పిచ్చి పట్టిన రాజాకీయపార్టీలు, తలకాయ మాసినోడు ఎవదుపడితే వాడు మాట్లాడితే మేము చేయాలా…ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది.

 

* వెస్ట్ బెంగాల్ రాష్టాన్ని పాలించిన సీపీఎం పార్టీ నేతలు ఆర్టీసీని మూసింది. 

 

* ఆర్టీసీ యూనియన్లు వల్లనే ఆర్టీసీకి ఈ పరిస్థితి.

 

* యూనియన్ రాజకీయాల దిక్కుమాలిన అర్థం లేని సమ్మె.

 

* త్వరలో ఆర్టీసీ ముగుస్తుంది ఇది నిజం.

 

* లాయర్లను పెట్టి అబద్దాలు చెబుతున్నారు… కార్మికుల పీఎఫ్ డబ్బులు ప్రభుత్వం వాడుకుందా?

 

* ఎన్ని ప్రైవేట్ ట్రావెల్ నడుస్తున్నాయి.. జబ్బర్ ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్, కేశినేని ట్రావెల్స్ లాభాల్లో ఉంటే…ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో ఉంది.

 

* ఆర్టీసీ బస్సుపైన ప్రతి కిలోమీటర్‌కు రూ.13 నష్టం వస్తుంది.

 

* ఆర్టీసీ నుంచి అద్దె బస్సుల్ని తోలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే నిండా మునగమనా?

 

* ఈ దిక్కు మాలిన యూనియన్ల వల్ల వచ్చే నష్టాన్ని మేము భరించాము.

 

* బతుకమ్మకు, దసరా సమయాల్లో ఆర్టీసీకి డబ్బులు ఎక్కువ వస్తాయి.

 

* అదనంగా డబ్బులు వచ్చే సమయంలో ఈ యూనియన్‌లు సమ్మెకు వెళ్లాయి.

 

* నోటీస్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించదు. కమిటీలు వేశాము.

 

* ప్రభుత్వంలో విలీనం చేసే దాకా మేము ఊరుకోము అంటే ఎలా.

 

* ఆర్టీసీ దగ్గర రూపాయి లేని పరిస్థితి ఇప్పుడు.

 

* పండుగల సమయాల్లో అదనంగా వచ్చే ఆదాయాన్ని కోల్పోయారు.

 

* చచ్చిపోయిన యూనియన్ ఎన్ఎంయు సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని కేసు వేసింది.

 

* ఎం చేస్తాది హై కోర్టు కొడతదా.

 

* దిక్కు మాలిన యూనియన్లు ఆర్టీసీని వాళ్లే ముగించుకుంటున్నారు.

 

* నరేంద్ర మోదీ తీసుకువచ్చిన కొత్త మోటారు వెహికల్ చట్టం ప్రకారం..ప్రైవేట్ వాహనాల విషయంలో పర్మిట్లు ఇవ్వొచ్చు.

 

* చార్జీలు తగ్గుతాయి…ప్రజలకు మేలు జరుగుతుంది.

 

* ఇది ఒక పిచ్చి సమ్మె. అర్థం పర్థం లేని, బుద్ధి జ్ఞానం లేని సమ్మె. ఇది ఇల్లీగల్ సమ్మె, ఎస్మా ఉంది.

 

* హైకోర్టుకు తీర్పు చెప్పే పవర్ లేదు… లేబర్ కోర్టుకు వెళ్ళాలి… అప్పుడు నాలుగు బస్ స్టాండ్‌లు అమ్మి సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలి.

 

* ఒక్క శాతం కూడా పాత ఆర్టీసీ ఉండదు.

 

* యూనియన్లు వద్దు అని కార్మికులు వస్తే చూస్తాం.

 

* ఆర్టీసీ డ్రైవర్లతో, కండక్టర్‌లతో నాకు పంచాయతీ లేదు.

 

* ఆర్టీసీ సమ్మెకు ముగింపు… ఆర్టీసీ ముగింపు మాత్రమే.

 

* కార్మికుల డిమాండ్ చేయమని చెప్పే అధికారం మాకు లేదు అని హైకోర్టు చెప్పింది.

 

* నాతోపాటు పనిచేసేవాడు దొంగతనం చేస్తే దొంగ కాదా.

 

* త్వరలో రవాణా శాఖ మంత్రితో కలిసి 6నుండి 7వేల బస్సులకు పర్మిట్ ఇస్తాం.

 

* సీపీఎం వచ్చిన తరువాత యూనియన్లు సంపీ సంపీ పరిగెత్తించారు…అందుకే నానో కారు కలకత్తా నుంచి పారిపోయింది.

 

* కలకతాలో ఇంటికి కలర్ వేస్తే కూడా చందా అడిగారు యూనియన్లు.

 

* బిల్డింగులకు కలర్ వేస్తే టాక్స్ రద్దు అని మమత బెనర్జీ ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది యూనియన్ల వల్ల.

 

* ఇక నుంచి ఎవ్వరు సమ్మె చేసినా ఇలాంటి చర్యలే ఉంటాయి.

 

* చనిపోయిన కార్మికులకు బాధ్యత వహించాల్సింది యూనియన్లే.

 

* ఆంద్రప్రదేశ్‌లో కమిటీ వేశారు…3నెలల తరువాత చెబుతాడు జగన్ అక్కడ.

 

* 48 వేల మంది రోడ్డు మీద పడుతాం అంటే మేము ఎం చేయాలి.

 

* మేము గొంతు కోసుకుంటాము అంటే ప్రభుత్వం ఏమి చేయాలి.

 

* అసెంబ్లీ రద్దు చేయాలని ఎవడో బేవకూఫ్ అంటే రద్దు చేస్తామ. ఎవడు వాడు అన్నోడు.

 

* కార్మికుల బ్రతుకులు నాశనం చేస్తున్నాయి కార్మిక సంఘాలు.

 

* ఉద్యోగం కావాలంటే వెళ్లి దరకాస్తు పెట్టుకోవాలి కార్మికులు.

Telangana cm kcr about rtc strike