తెలంగాణలో కరోనా పరిస్థితిపై ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో లాక్డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాలు, వలస కార్మికులకు సంబంధించి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఆ వివరాలను సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మే నెలలోనే పది పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 3 పరీక్షలు జరిగాయి. ఇంకా 8 పరీక్షలు జరగాల్సి ఉంది. హైకోర్టు నిబంధనల ప్రకారం పది పరీక్షలు నిర్వహిస్తాం. మన రాష్ట్రంలో సుమారుగా 2500 పరీక్షా సెంటర్లు ఉన్నాయి. అవసరమైనతే వాటిని 5000లకు పెంచుతాం. ఒక గదిలో 15 మంది విధ్యార్ధులను ఉంచి పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూస్తాం. పరీక్షా సెంటర్లను ప్రతిరోజూ శానిటైజే చేస్తాం. విద్యార్థులు కూడ మాస్కులు తప్పనిసరి ధరించాలి. ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలిస్తాం. ఏదేమైనా మే నెలలో పదో తరగతి పరీక్షలు పూర్తి చేసితీరుతాం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.