సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ఎంగేజ్‌మెంట్! - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ఎంగేజ్‌మెంట్!

October 19, 2020

ngvnvgj

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష గుర్తుందా? 2017లో కన్నతండ్రి, పినతల్లి పెట్టే  చిత్రహింసలను తాళలేక హాస్పిటల్‌లో చేరింది. ఆమె గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సీఎం కేసీఆర్ స్వయంగా హాస్పిటల్‌కు వెళ్లి ప్రత్యుషను పరామర్శించారు. సీఎం కేసీఆర్‌తో సహా ఆయన భార్య శోభ, ఆయన కూతురు కవిత కూడా వెళ్లారు. అప్పుడు సీఎం కేసీఆర్.. ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీఎం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నెటిజన్లు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌ను కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఏస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యూష యోగ క్షేమాలను చూస్తోంది.  

fbfgnbfgh

సీఎం కేసీఆర్.. ప్రత్యూషకు మెరుగైన వైద్యం అందించారు. ఆమె ఇష్టపడిన నర్సింగ్ కోర్సు చదివించారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమెను కోరుకున్న వరుడితో పెళ్లి చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఏంతో నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు.

fbfgnbfgh

మమత, మార్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్యూషను కలిసి ఈ విషయం చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలియజేసింది. వారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్.. ప్రత్యూషను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ప్రత్యుష పెళ్లి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యూష నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ అండతోనే కోలుకున్నానని, తన పెళ్ళికి వస్తానని కేసీఆర్ తనతో చెప్పినట్లు ప్రత్యూష తెలిపింది. మంచి కుటుంబంలోకి కోడలిగా వెళ్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది.