కేంద్రం తీరుతో తెలంగాణకు 40 వేల కోట్ల ఆదాయం తగ్గింది.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రం తీరుతో తెలంగాణకు 40 వేల కోట్ల ఆదాయం తగ్గింది.. కేసీఆర్

November 24, 2022

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతి నిరోధక విధానాల వల్ల తెలంగాణ భారీగా ఆదాయం కోల్పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రజలకు వివరించడానికి డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని గురువార ఆదేశించారు.

‘‘అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది’’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.