కేసీఆర్ పుట్టిన రోజును పండగలా జరుపుతున్న గులాబీ శ్రేణులు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ పుట్టిన రోజును పండగలా జరుపుతున్న గులాబీ శ్రేణులు

February 17, 2020

cm kcr.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 66వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలను అంబరాన్ని అంటేలా వేడుకలు నిర్వహిస్తున్నారు  గులాబీ శ్రేణులు. కేకులు కట్ చేసి, మొక్కలు నాటుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

తల్లిన కన్న తనయుడికి శుభాకాంక్షలు : 

 

తన తండ్రికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ కోసం ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా ఆయన్ను కొనియాడారు. మీరు దీర్ఘకాలం జీవించాలని, మీ ముందుచూపుతో, నిబద్దతతో మాలో ఇలాగే స్ఫూర్తిని నింపాలని పేర్కొన్నారు. 

బహ్రెయిన్‌లోనూ వేడుకలు :  

దేశంలోనే కాదు విదేశాల్లోనూ బర్త్‌డే వేడుకలు జరిగాయి. బహ్రెయిన్‌ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్‌ రాధారపు సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అటు గల్ఫ్‌ దేశాల్లో టీఆర్ఎస్ అభిమానులు కేకులు కట్ చేశారు. రాష్ట్రం సిద్ధించడానికి కృషి చేసిన వ్యక్తి ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.  

మొక్కనాటిని మంత్రి హరీష్ రావు :

కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్ధిపేట జిల్లాలో లక్షా 10 వేల మొక్కలు నాటేందుకు సంకల్పించామని హరీశ్ రావు వెల్లడించారు. ప్రజల మధ్య వేడుకలు జరపడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ఆదర్శాలను ఆచరిస్తూ మొక్కలను రక్షించాలని సూచించారు. 

 

హరీష్ శంకర్‌తో కలిసి సంబరాల్లో క్రాంతి కిరణ్ : 

ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సీని దర్శఖుడు హరీష్ శంకర్‌తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.  బంజారాహిల్స్‌లోని హరీష్‌ శంకర్‌ ఆఫీస్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కేసీఆర్‌కు పుట్టిన రోజున తన మిత్రుడు కాంత్రి కిరణ్‌తో కలిసి హరితహారంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పద్మావతి కాలనీలో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత కేక్‌ కట్‌ చేపిన అనంతరం చిన్నారులకు మంత్రి పండ్లు, స్కూల్‌ బ్యాగులు, పంపిణీ చేశారు.