Home > Featured > ప్యాకేజీ భోగస్?..కేంద్రంపై కేసీఆర్ నారాజ్

ప్యాకేజీ భోగస్?..కేంద్రంపై కేసీఆర్ నారాజ్

cm kcr.

తెలంగాణ లాక్ డౌన్ కాలాన్ని మే 31 పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ‌ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ‌ సమావేశం తరువాత సీఎం కేసీఆర్ మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కేంద్రం ప్యాకేజీ వట్టి డొల్ల అన్నారు. రాష్ట్రాలు ఒకటి కోరితే.. కేంద్రం ఇంకొకటి ఇచ్చిందన్నారు. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు.

"కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంచాలని రాష్ట్రాలు అడిగితే సంస్కరణలు అమలు చేస్తే ఇస్తామని కేంద్రం అంటోంది. కేంద్రానిది పచ్చి మోసం, దగా. రాష్ట్రాలపై పెత్తనం చేలాయిస్తానంటే నడవదు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా? కేంద్రం దారుణంగా బిహేవ్ చేస్తోంది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యూడల్ విధానంలో ఉన్నాయి. ఇదేనా రీఫార్మ్స్ చేసే పద్దతి. కేంద్రం పెట్టిన షరతులకు అందరూ నవ్వుతున్నారు. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అనరు. కేంద్రం రాష్ట్రాలతో వ్యవహరించే పద్దతి ఇది కాదు. అన్ని కేంద్రం ఆధీనంలో ఉంటే ఇక రాష్ట్రాలు ఎందుకు? మున్సిపాలిటీల్లో ఛార్జీలు పెంచితే రుణ పరిమితి పెంచుతారా? దీన్ని అసలు ప్యాకేజీ అంటారా? ఇది పచ్చిమోసం. ఇండియాలో అంతా ప్రయివేట్ అవుద్దీ. కేంద్రం సహకరించకున్నా తట్టుకొని నిలబడుతాం. విపత్తు వేళ కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదు. మెడ మీద కత్తి పెట్టి ఇది చెయ్యి.. అది చెయ్యి అని చెప్పడం ప్యాకేజీనా? ఆ నిబంధనలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామంటే అవి మాకు అక్కర్లేదు" అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 18 May 2020 10:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top