కాంగ్రెస్‌పై గరమైన సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్‌పై గరమైన సీఎం కేసీఆర్

September 22, 2019

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై గరమయ్యారు. నైతికత గురించి నీతులు చెప్పే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పాలనలోనే చెరువులు, అడవులు ధ్వంసమైనవి.. కాంగ్రెస్‌, బీజేపీ పాలన వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇలా ఉందన్నారు. ఎప్పటికైనా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనన్నారు. 

జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి గులాములుగా ఉంటారని ఘాటుగా విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులను చిత్తు కాగితంలా వదిలేసి తెలంగాణ స్వరాష్ట్రం సాధించామన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే తెలంగాణలో వలసలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు కూడా కాంగ్రెస్‌ పుణ్యమే అని అవహేళన చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వచందంగా వచ్చి టీఆర్ఎస్‌లో చేరాతమంటేనే వారిని తమ పార్టీలో విలీనం చేసుకున్నామని తెలిపారు. టీఆర్ఎస్‌లో చేరేందుకు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా కాంగ్రెస్ నాయకులు సిద్దపడ్డారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందన్నారు. కాంగ్రెస్ నేతలకు సరైన అవగాహన, భౌగోళిక, శాస్త్రీయ పరిజ్ఞానం లేకుండానే మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.