వీణావాణితో కేక్ కట్ చేయించిన హిమాన్షు - MicTv.in - Telugu News
mictv telugu

వీణావాణితో కేక్ కట్ చేయించిన హిమాన్షు

February 17, 2020

himanshu.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్ రావు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంధర్బంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇదిలా ఉంటే హిమాన్ష్.. తాత కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా స్టేట్ హోమ్‌కు చేరుకొని అభవక్త కవలలైన వీణ వాణిల చేత కేక్ కట్ చేయించాడు. తాత పుట్టిన రోజు సందర్భంగా హిమాన్షు చేసిన పనికి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Publiée par Satyavathi Satya sur Lundi 17 février 2020