Telangana cm kcr grandson ktr son Himanshu rao won school council election
mictv telugu

స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో కేసీఆర్ మనవడి గెలుపు

May 7, 2022

Telangana cm kcr grandson ktr son Himanshu rao won school council election

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షురావు ఇదివరకు చెప్పాడు. రాజకీయాల సంగతి పక్కనబెడితే అతడు స్కూల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో హిమాన్షు క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేశాడు.

పోటీలో నిలబడిన అభ్యర్థులు స్కూలు యాజమాన్యం మొదట ఇంటర్వ్యూ చేసి, అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఫైనల్‌కు చేరుకున్న వారితో పోలింగ్ జరపగాన హిమాన్షు అగ్రస్థానంలో నిలిచాడు. క్రియేటివ్ యాక్షన్ అధ్యక్షుడిగా అతనికి బాధ్యతలు అప్పగించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు ఈ యాక్షన్ కమిటీ సేవలు అందజేస్తుంది. సోషల్ మీడియాలో, సామాజిక సేవలో క్రియాశీలంగా ఉంటే హిమాన్షు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్నేషనల్ బకలారియేట్ డిప్లమా ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.