ఢిల్లీకి కేసీఆర్..ప్రధానితో సమావేశం! - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీకి కేసీఆర్..ప్రధానితో సమావేశం!

December 3, 2019

Telangana cm kcr02

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లలో పర్యటించనున్నారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం. 

ప్రధానమంత్రితో భేటీలో ప్రధానంగా తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్‌ గడ్కరీలను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ ఇంట్లో జరగనున్న వివాహ వేడుకకు కేసీఆర్ హాజరుకానున్నారు.