తెలంగాణలో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన పంటలను కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటపొలాలను కేసీఆర్ పరిశీలించారు. రైతులను అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు.
ఇక సీఎం పర్యటనలో సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలు ప్రకారం కేసీఆర్ తనతో పాటు తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ను బస్సులో కూర్చొని తింటున్నారు. తన స్టాఫ్‌తో కలిసి ఓ సామన్య వ్యక్తిలా భోజనం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ భోజనం దృశ్యాలు వైరల్‌గా మారాయి. చిన్నచిన్న రాజకీయ నేతలే తమ పర్యటనలలో హంగు ఆర్భాటలతో రకరకాల వంటకాలు వండించి ఆరగించే రోజల్లో సాక్ష్యాత్తు ఓ సీఎం ఇలా భోజనం చేయడం హాట్ టాపికైంది. ఉదమ్యకాలం నాటి నుంచే కేసీఆర్‌కు సామ్యన్య జీవితం అలావాటని మరోసారి బీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.