ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ

May 22, 2022

ఉత్తరాది పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. లంచ్‌మీటింగ్‌కు ఆహ్వానించడంతో సీఎం కేసీఆర్‌.. కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ విందు సమావేశంలో.. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి తదితర అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్న భోజనం తర్వాత కేజ్రీవాల్‌, కేసీఆర్‌ చండీగఢ్‌ వెళ్లనున్నారు. సాగు చట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సీఎంలు పరామర్శించనున్నారు. అమరులైన రైతు కుటుంబాలకు కేసీఆర్‌ ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ కూడా పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్‌ బృందంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, నామా నాగేశ్వరరావు, రంజిత్‌ రెడ్డి, వెంకటేష్‌ నేత పాల్గొన్నారు.