తెలంగాణ గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

April 1, 2020

Telangana cm kcr met with governor

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 97కు చేరింది. మంగళవారం కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. ప్రస్తుతానికి 77 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల గురించి, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి చర్చించాడనికి సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని ఈరోజు కలిశారు. రాజ్ భవన్ కు ఈరోజు సాయంత్రం కేసీఆర్ సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెల్త్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు వెళ్లారు.