రెవిన్యూ వ్యవస్థ రద్దుపై మీరేమంటారు?: కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రెవిన్యూ వ్యవస్థ రద్దుపై మీరేమంటారు?: కేసీఆర్

April 15, 2019

రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ  విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుపై ఆయన సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా లోపాలున్నాయని,  కొత్త చట్టం తీసుకురావాలని నేతలు కోరినట్లు సమాచారం.

Telangana cm kcr noted senior leaders opinions on quashing revenue.

భేటీ సందర్భంగా.. ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించిన  కేసీఆర్‌ రెండు జిల్లాలకు ఒక్కరు చొప్పున మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కో-ఆర్డినేటర్లుగా నియమించారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలను గెలవబోతున్నామని, కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీలతోపాటు అన్ని మండల పరిషత్ స్థానాలను గెలిచి తీరాలని, దీని కోసం అందరినీ కలుపుకు పోవాలని చెప్పారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,  పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.