ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే ‘రైతు బంధు’ డబ్బులు..  - Telugu News - Mic tv
mictv telugu

ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే ‘రైతు బంధు’ డబ్బులు.. 

May 13, 2020

Telangana cm kcr on crops 

ప్రభుత్వం నిర్దేశించిన పంటలు వేస్తేనే రైతు బంధు’ పథకం కింద ఆర్థిక సాయం అందుతుందని, అలా చేస్తేనే ధాన్యాన్ని మద్దతు ధరలకు కొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. రైతులందూ ఒకే పంట వేస్తే సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. ఈ  ఏడాది వరితోనే పంటల మార్పిడి మొదలు కావాలన్నారు. పంట మార్పిడి కాలనీలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత సీఎం కార్యాలయం కొన్ని ట్వీట్లు చేసింది. 

ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని ఆయన సూచించారు. ‘అందరూ  ఒకే పంట వేస్తే గిట్టుబాటు ధర రాదు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్లు పంటలు వేయండి. పంట వేస్తే లాభమో ప్రభుత్వం మీకు చెబుతుంది. విత్తనాల పంపిణీలోనూ ఈ విధానాన్ని అనుసరిస్తాం. ప్రభుత్వం చెప్పే పంటల విత్తనాలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి…’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విత్తన నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తానని, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.