ప్రజాప్రతినిధులు ఎక్కడ?: కేసీఆర్ కన్నెర్ర - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజాప్రతినిధులు ఎక్కడ?: కేసీఆర్ కన్నెర్ర

March 24, 2020

vvb

కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు మరోసారి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. 

ఈ సందర్భంగా ప్రజానియంత్రణలో కేవలం పోలీసులు, అధికారులు మాత్రమే కనిపిస్తున్నారని, ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా కనిపించడంలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో ఉన్న 150 మంది కార్పొరేటర్లు ఏమయ్యారని అడిగారు. ప్రజాప్రతినిధులకు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులందరూ వెంటనే రంగంలోకి దిగాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ స్వంత నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రజానియంత్రణ చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు. మంత్రులు ఎవరి జిల్లాకు వాళ్ళు వెళ్లాలని కోరారు. కేవలం ఆరోగ్య మంత్రి, మున్సిపల్ మంత్రి మాత్రమే హైదరాబాద్‌లో ఉండాలని తెలిపారు.