ప్రగతి భవన్ ముట్టడి..రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రగతి భవన్ ముట్టడి..రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

October 21, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలనీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. 

Revanth Reddy House Arrest

Revanth Reddy House Arrest

Posted by Anumula Revanth Reddy on Sunday, 20 October 2019

దీంతో ప్రగతి భవన్ పరిసరాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పటు చేశారు. కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనను హౌజ్ అరెస్ట్ చేసిన వీడియోను రేవంత్ రెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.