బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
“కవితను అరెస్టు చేస్తారట..చేయనివ్వండి..ఏం చేస్తారో చూద్దాం. ఈడీలకు భయపడే ప్రసక్తే లేదు. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకు వచ్చారు. నోటీసుల పేరుతో పార్టీ నాయకులందరినీ వేధిస్తున్నారు. పోరాటం వదిలేది లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లేకుండా చేస్తాం . ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం” అని కేసీఆర్ అన్నారు.
శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కవితకు మద్దతుగా దిల్లీ బయల్దేరి వెళ్లారు.
ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కవిత విచారణ సందర్భంగా రెండు రోజులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.