ట్రంప్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక బహుమతులు! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక బహుమతులు!

February 24, 2020

gcbgbgn

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన ట్రంప్‌కు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. ట్రంప్ తన సతీమణితో కలిసి సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. మోదీ దగ్గరుండి ట్రంప్ దంపతులకు సబర్మతి ఆశ్రమాన్ని చూపించారు. 

ట్రంప్ పర్యటనలో భాగంగా ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. విందు సందర్భంగా ట్రంప్‌కు తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేకంగా కొన్ని కానుకలు అందించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సంస్కృతీకి ప్రాముఖ్యత ఉండేలా ఈ ప్రత్యేక కానుకలు ఉండనునున్నాయని తెలుస్తోంది. ఫిలిగ్రి ఛార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపిక, పోంచపల్లి శాలువాను అందజేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ సతీమణి మెలానియా, కూతురు ఇవాంక కోసం పోచంపల్లి, గద్వాల పట్టు చీరల్ని బహూకరించనున్నట్లు తెలుస్తోంది. 2017 నవంబర్‌లో ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రభుతం ఆమెకు ప్రత్యేక కానుకలను ఇచ్చిన సంగతి తెలిసిందే..