అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చేస్తాం..సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చేస్తాం..సీఎం కేసీఆర్

July 19, 2019

Telangana cm kcr speech about new municipal act ....

ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని కీలక వాఖ్యలు చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుందని తెలిపారు. ఇంటి కొలతల విషయంలో అబద్ధాలు చెప్తే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. ప్రజలను నమ్ముతున్నాం, వారిని విశ్వసిస్తున్నాం.. ప్రజలేవరూ లంచాలకు ఇవ్వొద్దని తెలిపారు. 

అధికారాన్ని ప్రజలు దుర్వినియోగం చేయొద్దు.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్రమమైన బిల్డింగ్ కడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని హెచ్చరించారు. కొత్తగా తీసుకొని వస్తున్న చట్టం కఠినంగా ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్ వంటి కేసుల్లో చాలా సందర్భాల్లో హైకోర్టు ముందు కూడా తల దించుకోవాల్సి వచ్చిందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రియల్ టైమ్ పరిపాలనా సంస్కరణలు తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అద్భుతంగా పని చేస్తాం.. ఇండియా అబ్బురపడే విధంగా పని చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019తో పూర్తి పారదర్శకత వస్తుందని కేసీఆర్ తెలిపారు.