హస్తినకు బయల్దేరివెళ్లిన సీఎం కేసీఆర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

హస్తినకు బయల్దేరివెళ్లిన సీఎం కేసీఆర్‌

February 25, 2020

ccbc

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందులో పాల్గొనడానికి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య అతిధులు ఈ విందుకు హాజరుకానున్నారు.

ఈ విందు సందర్భంగా ట్రంప్‌కు తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేకంగా కొన్ని కానుకలు అందించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సంస్కృతీకి ప్రాముఖ్యత ఉండేలా ఈ ప్రత్యేక కానుకలు ఉండనునున్నాయని తెలుస్తోంది. ఫిలిగ్రి ఛార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపిక, పోంచపల్లి శాలువాను అందజేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ సతీమణి మెలానియా, కూతురు ఇవాంక కోసం పోచంపల్లి, గద్వాల పట్టు చీరల్ని బహూకరించనున్నట్లు తెలుస్తోంది. 2017 నవంబర్‌లో ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రభుతం ఆమెకు ప్రత్యేక కానుకలను ఇచ్చిన సంగతి తెలిసిందే.