జనగామ పర్యటనకు కేసీఆర్.. రైతు వేదిక ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

జనగామ పర్యటనకు కేసీఆర్.. రైతు వేదిక ప్రారంభం

October 31, 2020

jangaon

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజవర్గంలోని కొడకండ్ల గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డిలు దగ్గరుండి చూసుకున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొడకండ్లకు వెళ్లనున్నారు. 12:10 నివిుషాలకు రైతు వేదిక భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వైకుంఠదామం డంపింగ్ యాడ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం 5000 మ౦ది రైతులతో కలిసి సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రైతు వేదికల ఉద్దేశం, వాటి ఆవశ్యకతను రైతులకు సీఎం వివరించనున్నారు. తరువాత అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. 

ఈ పర్యటన అనంతరం శనివారం సాయంత్రం కొడకండ్ల నుంచి కేసీఆర్ తిరుగుపయనం కానున్నారు. 15 సెప్టెంబర్ 2017న రాష్ట్రంలోని 10,733 గ్రామాల్లో రైతుబంధు సమితులు ఏర్పడ్డాయి. గ్రామ స్థాయిలో 15మంది రైతులతో, మండలస్థాయిలో 24 మందితో, జిల్లాస్థాయిలో 24 మందితో, రాష్ట్రస్థాయిలో 42 మంది సభ్యులతో సమితులు ఏర్పడ్డాయి. రైతు సమన్వయ సమితుల్లో  మొత్తం 1 లక్షా 61 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రూ.573 కోట్లతో 2,604 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మాణం జరిగింది. రైతులు, వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమయ్యేలా ప్రభుత్వం రైతు వేదికలు ఏర్పాటు చేసింది. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించి, ప్రతీ క్లస్టర్‌లో రూ.22 లక్షల ఖర్చుతో ఒక రైతు వేదిక ఏర్పడింది.