యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ 

September 13, 2020

Telangana cm kcr visit in yadadri

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. సీఎం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. పూజ తరువాత సీఎం ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈవో గీత, స్థపతి ఆనంద సాయి సీఎం కేసీఆర్‌కు ఆలయ పనులను వివరించారు. ఆలయ పనుల తీరుపై అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ఈ పర్యటనలో మంత్రి జగదీశ్వర్ ‌రెడ్డి, ఎంపీ సంతోశ్ కుమార్, విప్ గొంగిడి సునీత‌, అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు యాదాద్రిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఆలయ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలయంలో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.