నాయినిని చూసి కన్నీటిపర్యంతమైన కేసీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

నాయినిని చూసి కన్నీటిపర్యంతమైన కేసీఆర్ 

October 21, 2020

ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు పరామర్శించారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో ఉన్న నాయిని గదిలో వెళ్లి మాట్లాడారు. బెడ్డై వెంటిలేటర్‌తో దయనీయంగా కనిపించిన సహచరుడిని చూసి సీఎం కళ్లు నీటితో నిండిపోయారు. పక్కనే ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. 

నాయినికి అందిస్తున్న వైద్యంపై కేసీఆర్ డాక్టర్లను ఆరా తీశారు. నాయిని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. . ఊపిరితిత్తుల్లో నీరు నిండి నిమోనియాగా మారిందని వైద్యులు వివరించారు. కేసీఆర్ వెంట ఆయన బంధువు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా వెళ్లారు. కరోనా బారినపడిన నాయినికి ఇటీవల నెటిగివ్ ఫలితం రావడంతో ఆయన కోలుకుంటారని భావించారు. అయితే పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది.