తిరుమల చేరుకున్న కేసీఆర్‌.. - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల చేరుకున్న కేసీఆర్‌..

May 26, 2019

Telangana Cm KCR went Tirumala With Family Members.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తిరుమల చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కుటుంబ సభ్యులు బయలుదేరారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ తొలిసారి తిరుమల వస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, చింతాల తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్.. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి తిరుమల వెళ్లారు.