కొన్ని రాజకీయ పార్టీలు కులమతాల పేరుతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాటి ప్రయత్నాన్ని తిప్పికొడతామని బీజేపీని ఉద్దేశించి హెచ్చరించారు. ఆయన సోమవారం కాజీపేట దర్గాను దర్శించుకుని విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ దర్గాలో మత సామరస్యానికి పునాది పడింది. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ కుట్రలను అందరూ తిప్పి కొట్టాలని కోరుతున్నాను’’ అని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ దర్గాను దర్శించి ప్రభుత్వం తరపున గిలాఫ్ ఈ చదర్ సమర్పిస్తానని చెప్పారు .ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల్లో 25 శాతం మైనారిటీల అభివృద్ధికి కేటాయిస్తామని ఆయన హమీ ఇచ్చారు.