కేసీఆర్ అన్నింటా ఎక్స్‌పర్ట్.. ఉత్తమ్ కుమార్ ఎద్దేవా  - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ అన్నింటా ఎక్స్‌పర్ట్.. ఉత్తమ్ కుమార్ ఎద్దేవా 

May 23, 2020

uttam kurmar reddy

తెలంగాణలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతుంటే ప్రభుత్వం ఆదుకోకుండా ఊకదంపుడు మాటలతో కాలం వెళ్లబుచ్చుతోందని కాంగ్రెస్ మండిపడింది. కూలీలను స్వస్థలాలకు తరలించడంతో కేసీఆర్ ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఈరో మీడియాతో మాట్లాడారు.

‘వలస కూలీలు నడుస్తుండే దేశ విభజన కాలం గుర్తుకొస్తోందని సోనియా గాంధీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారు. వాళ్లు చచ్చిపోయినా ఫర్వాలేదనుకున్నాయి. కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన అన్నింటా ఎక్స్‌పర్ట్. మరి వలస కార్మికులను ఎందుకు ఆదుకోలేకపోయారు?’ అని ప్రశ్నించారు. 

దేశంలో13 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని, వారికి ఆహారం, నగదు పంచి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. ‘తెలంగాణలో వలస కార్మికులు కేవలం 3 లక్షలని సీఎం అన్నారు. మంత్రి తలసాని 6 అక్షలు అన్నారు. మీ దగ్గర సరైన లెక్కలే లేవు. ఇంకెలా సాయం చేస్తారు? మా పార్టీ సొంతంగా కార్మికులను తరలించింది..’ అని ఉత్తమ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కేసీఆర్ కాలరాస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే బర్త్ డే పార్టీ వార్త రాసినందుకు జర్నలిస్టు ఇంటిని కూల్చారని ఆరోపించారు. కాగా, ఉత్తమ్ కుమార్ ఆదేశంలో వలసకార్మికుల డేటా పోర్టల్ రూపొందించామని పీసీసీ ఐటీ సెల్ ఇంచార్జి మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. ‘కృత్రిమే మేధతో దీన్ని రూపొందించాం. ఐటీ మంత్రిగా ఉన్న సీఎం తనయుడు ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు?’ అని ప్రశ్నించారు.