కుంతియా స్పీడును..కాంగ్రెస్ లోకల్ నాయకత్వం అందుకుంటుందా? - MicTv.in - Telugu News
mictv telugu

కుంతియా స్పీడును..కాంగ్రెస్ లోకల్ నాయకత్వం అందుకుంటుందా?

August 14, 2017

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచినట్టు  కనిపిస్తుంది.అయితే అది  వాపో,బలుపో అని తేలాలంటే కొంచెం టైం పట్టేటట్టే ఉంది.కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా..రోజుకో  ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తేవాలని బాగానే ఆరాటపడుతున్నారు.రోజూ మీడియాకుత ఏదో  మేత పెడుతూ వార్తల్లో నిలవాలనే  ప్రయత్నాన్ని చేస్తున్నారు.ఏకంగా కేసీఆర్ సవాల్ విసిరిన కుంతియా తాజాగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలను మీడియాకు  చిట్ చాట్ రూపంలో ఇస్తన్నారు.

సెప్టెంబర్ నెలలో పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు సమన్వయ కమిటీ సైజును తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు కుంతియా మీడియాకు తెలిపారు.2019వరకు ఉత్తమ్ కుమారే తమ కెప్టెన్ అంటూ తేల్చేసారు.అంతటితో ఆగకుండా  పార్టీ విది విధానలను,కట్టుబాట్లను దాటే ఎవర్ని ఉపేక్షించేదిలేదని సెలవిచ్చారు కుంతియా.ఎన్నికలకు 6నెలల ముందే  అభ్యర్థులను ప్రకటిస్తామని తమ విధానాన్ని ప్రకటించారు.పొత్తులపై హైకమాండ్ దే  తుది నిర్ణయమని,ఎవరితో కలవాలి,ఎప్పుడు కలవాలన్నది స్ధానిక పరిస్ధితులను బట్టి అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.

తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ పనితీరుపై రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారంటూ మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు.బూతు మండల స్ధాయినుంది కాంగ్రెస్ ను బలోపితం చేసే ప్రక్రియ శురువైందని అన్నారు కుంతియా.