తెలంగాణ కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. క్రిశాంక్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. క్రిశాంక్ రాజీనామా

March 16, 2019

తెలంగాణ కాంగ్రెస్‌కు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతోంది. ఎమ్మెల్యేలే కాదు, సీనియర్ నేతలు, వాగ్దాటి ఉన్న నాయకులూ టాటా గుడ్ బై అంటున్నారు. మీడియాలో పార్టీని వాణిని గట్టిగా వినిపించే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ  అధికార ప్రతినిధి క్రిశాంక్ కూడా తప్పుకోనున్నారు. తాను కాంగ్రెస్‌లో చాలా రకాలుగా నష్టపోయి, భవిష్యత్తును పాడు చేసుకున్నానని ఆయన అన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తన అభిమానులను, అనుచరులను సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ ప్రాణాళిక ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ చాలామంది కార్యకర్తలకు, యువతకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ మేరకు లేఖ రాశారు. 

Telangana congress Krishank announced his resignation to party alleging not giving importance to youth leaders.

‘నాకు 2014, 2018లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. టికెట్ ఇవ్వకుండా కుటుంబంలో చిచ్చుపెట్టారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని అడిగితే.. ‘నీ దగ్గర అంత డబ్బు లేదు కోట్లు ఖర్చు పెట్టుకోలేవు’ అని ఉత్తమ్ అన్నారు పార్టీలో ఓడిపోయిన వారికి, కేసులు ఉన్న వారికే టికెట్ ఇచ్చారు.  కార్యకర్తల మనోభావాలకు విలువ లేకుండా పోతోంది. ఓడిపోయి, ఓటుకు నోటు కేసులో ఉన్నోళ్లకు(రేవంత్ రెడ్డి) మల్కాజ్‌గిరి టికెట్ ఎలా ఇస్తారు? పార్టీ విధానాలు మారాలి. టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి నాయకులను ఎంపీలు, ఎమ్మెల్యేలను చేసింది. కానీ కాంగ్రెస్ ఏం చేసింది?’ అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిశాంక్‌కు బదులు ఆయన మామ సర్వే సత్యానాయణకు టికెట్ ఇవ్వడం తెలిసిందే.

Krishank Resignation Letter(1)

నరేశ్ జాదవ్ కూడా 

మరోవైపు.. ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ నేత నరేశ్‌ జాదవ్‌ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిన జాదవ్ఈ ఈసారీ అదే స్థానాన్ని ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్ట  దాన్ని మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌కు కేటాయించింది. దీంతో జాదవ్ మనస్తాపంతో రాజీనామా చేశారు. నేత సోయం బాపూరావు సైతం కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.