Telangana congress leader addanki dayakar apology to komatireddy Venkata Reddy
mictv telugu

కోమటిరెడ్డిపై బూతు మాటకు అద్దంకి సారీ

August 6, 2022

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యాలకు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ క్షమాపణ కోరారు. ‘వెంకటరెడ్డికి, ఆయన అభిమానులకు క్షమాపణలు. ఏదో ఆవేశంలో నోరు జారి అలా అన్నాను. దానిపై అధిష్టానానికి వివరణ ఇచ్చేలోపే నాకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను..’ అని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ అద్దంకి ఓ సమావేశంలో బూతు మాట్లాడారు. ‘పార్టీలో ఉంటే ఉండే లేకపోతే ..’ అని సభలో అన్నారు. దీంతో కోమటిరెడ్డి అభిమానులతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల అద్దంకి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేస్తాయంటూ అధిష్టానం దయాకర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.