తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారిని నియమించడంపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాణి కుముదినికి ఈ పదవి ఎందుకివ్వలేదని టీపీసీపీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. ‘’1988 బ్యాచ్‌కు చెందిన రాణి కుముదినికి మరో ఆరు నెలల సర్వీసు మాత్రమే ఉంది. శాంతికుమారి ఆమెకంటే జూనియర్. తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క దళితబంధు అని ప్రచారం చేస్తూ, దళిత సీనియర్ ఐఏఎస్ అధికారికి సీఎస్ పోస్టు ఇవ్వలేదు. బీఆర్ఎస్ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది’’ అని ఆయన మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన శాంతి కుమారి రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్‌గా రికార్డు సృష్టించారు. ఆమె పదవీకాలం 2025 ఏప్రిల్ వరకు ఉంటుంది.