ఎమ్మెల్యే గోదాలోకే దిగుదాం.. హుస్నాబాద్ నుంచి పొన్నం పోటీ….?
ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గౌడ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ చేతిలో ఓడిపోయిన ఆయన ఈసారి ఎంపీ ఎన్నికల్లో కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. హుస్నాబాద్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
పొన్నం 2009లో కరీం నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన 2014 రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడికి కూడా గురయ్యాయి. ఉద్యమ నేపథ్యంలో, మిరియాల దాడి సానుభూతి పనిచేయక 2014 ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కరీం నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీం నగర్ నుంచి పోటీ చేసి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేతిలో ఓడారు.
ఇలా వరసగా మూడుసార్లు ఓడిపోయిన పొన్నం ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలో ఉన్నారు. అటు ఢిల్లీ హైకమాండ్‌తోనూ, ఇటు రాష్ట్ర దళపతి రేవంత్ రెడ్డితోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న పొన్నానికి టికెట్ గ్యారంటీనే. 2009లో తప్ప మిగిన రెండుసార్లు ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కరీం నగర్ నుంచి కాకుండా తనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తే బావుటుందని ఆయన ఆలోచిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆ స్థానంలో ఎక్కువ ఉండడం దీనికి ఒక కారణం. హుస్నాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్ కుమార్ టూ టైమ్ ఎమ్మెల్యే కావడంతో ఈసారి కాంగ్రెస్‌కు మొగ్గు ఉంటుందనని ఆయన ఆలోచన. హుస్నాబాద్ టికెట్ దక్కించుకోవడంతో పార్టీ నుంచి ఇబ్బందులు కూడా ఎదురుకాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా ఈసారి హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే పార్టీ మారడం ఆయకు మైనస్ పాయింట్ అయిందని, టికెట్ తనకే ఇస్తారన పొన్నం ధీమా.